భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో

గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సింగారపు కుమార్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

తాగునీటి సరఫరా, VB-G RAM G పథకం పనుల పురోగతిపై శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, VB-G RAM G సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను గుర్తించి సమన్వయంతో పరిష్కరించేందుకు పలు సూచనలు చేశారు.

రాబోయే రోజుల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవో కుమార్ తెలిపారు. అవసరమైన చోట రైతుల వద్ద ఉన్న బావులు, బోర్లను అద్దెకు తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తద్వారా గ్రామాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టం చేశారు.

గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి: ఎంపీడీవో

VB-G RAM G పనుల్లో కూలీల సంఖ్య పెంచాలి

భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే ఊట కుంటల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని VB-G RAM G టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంపీడీవో సూచించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని తెలిపారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే చర్యలతో భవిష్యత్తులో నీటి లభ్యత మెరుగుపడేలా కృషి చేయాలని చెప్పారు.

అలాగే అన్ని గ్రామాల్లో VB-G RAM G పథకం కింద పనులను విస్తృతంగా చేపట్టి కూలీల సంఖ్యను గణనీయంగా పెంచాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న పనులను గుర్తించి కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో MPO యాసం వెంకటరమణ, APO మాధవి, పంచాయతీ కార్యదర్శులు, VB-G RAM G సిబ్బంది పాల్గొన్నారు.