భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సింగారపు కుమార్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
తాగునీటి సరఫరా, VB-G RAM G పథకం పనుల పురోగతిపై శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, VB-G RAM G సిబ్బందితో సమీక్ష…






