భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

31, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

పొడిచనుపల్లి తండా వద్ద పసిబాబు కలకలం.. నీలోఫర్‌కు తరలింపు

పొడిచనుపల్లి తాండ సమీపంలో వదిలివేసిన పసికందు.. మెరుగైన చికిత్స కోసం నీలోఫర్‌కు తరలింపు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది. పొడిచనుపల్లి తండా సమీపంలో పసిబాబును గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై జిల్లా బాలల సంరక్షణ విభాగానికి సమాచారం అందడంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు.

సమాచారం అందుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పసికందును రక్షించారు. అనంతరం వైద్య చికిత్స కోసం మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శిశువుకు అవసరమైన చికిత్స అందించారు.

అయితే వైద్యుల సలహా మేరకు పసిబాబుకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు కేసు నమోదు చేసి వివరాలు పరిశీలిస్తున్నారు.

తండా సమీపంలో పసికందును వదిలివెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శిశువును గుర్తించి రక్షించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం అధికారులు చర్యలు చేపట్టారు.