భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది. పొడిచనుపల్లి తండా సమీపంలో పసిబాబును గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై జిల్లా బాలల సంరక్షణ విభాగానికి సమాచారం అందడంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించారు.
సమాచారం అందుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పసికందును రక్షించారు. అనంతరం వైద్య చికిత్స కోసం మెదక్‌లోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శిశువుకు అవసరమైన చికిత్స…






