భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు మెదక్ జిల్లా రామాయంపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న రైతు గర్జన భారీ బహిరంగ సభకు వెళ్తున్న కేటీఆర్.. రామాయంపేట బైపాస్ రోడ్డులోని ఆదా హోటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.
మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ రాకతో రామాయంపేట బైపాస్ రోడ్డు వద్ద సందడి వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కేటీఆర్‌కు స్వాగతం పలికిన వారిలో మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయ యాదగిరి, మాజీ సొసైటీ చైర్మన్ బాజే చంద్రం, చౌదరి సుప్రభాత రావు, చౌదరి చరిత, మద్దెల మాధవి రమేష్, కన్నపురం కృష్ణ గౌడ్, నవత్ మహేష్, బాసం శ్రీనివాస్, ఎస్కే హైమద్, అస్నుద్దిన్, ప్రభావతి తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.