భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు మెదక్ జిల్లా రామాయంపేటలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న రైతు గర్జన భారీ బహిరంగ సభకు వెళ్తున్న కేటీఆర్.. రామాయంపేట బైపాస్ రోడ్డులోని ఆదా హోటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయనకు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి.

మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ…