భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

1, నవంబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామస్థాయి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజావాణిలో అధికారులకు అందజేయాలని సూచించారు. సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు ప్రజావాణి మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ఎంపీడీవో సింగారపు కుమార్ విజ్ఞప్తి చేశారు.