భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామస్థాయి సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజావాణిలో…