భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

నర్సాపూర్‌లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నర్సాపూర్‌లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేందుకు వీలుగా నర్సాపూర్ ప్రాంతంలో వరి కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. నర్సాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను నర్సాపూర్ MLA వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

కాగజ్‌మద్దూర్, నర్సాపూర్, పెద్దచింతకుంట, ఖాజీపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను MLA ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా గ్రామాల్లో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించుకునేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడనున్నాయి.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ రాజు యాదవ్, PACS చైర్మన్ రాజు యాదవ్, పెద్దచింతకుంట సర్పంచ్ శివకుమార్, ఉపసర్పంచ్ అంజయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

అలాగే రైతులు విఠల్, యాదగౌడ్, గౌరయ్య, నరేందర్, మల్లేశం, వెంకటేష్, రాజుతో పాటు PACS సిబ్బంది వెంకటస్వామి, శ్రీనివాస్, కుమార్, గోపాల్, పెద్దచింతకుంట కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ఆంజనేయులు పాల్గొన్నారు.