భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకునేందుకు వీలుగా నర్సాపూర్ ప్రాంతంలో వరి కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. నర్సాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను నర్సాపూర్ MLA వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

కాగజ్‌మద్దూర్, నర్సాపూర్, పెద్దచింతకుంట, ఖాజీపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను MLA ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా గ్రామాల్లో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి…