భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

రామాయంపేటలో ప్రజావాణి.. 8 అర్జీల స్వీకరణ

ఎంపీడీవో ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట ఎంపీడీవో సాజిలోద్దీన్ సూచించారు. సోమవారం రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు.

ఎంపీడీవో ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమం

ఈ సందర్భంగా ఎంపీడీవో సాజిలోద్దీన్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీటిలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒకటి, మున్సిపల్ శాఖకు సంబంధించి ఒకటి, రెవెన్యూ శాఖకు సంబంధించి నాలుగు అర్జీలు ఉన్నట్లు వెల్లడించారు.

ఎంపీడీవో ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమం

ప్రజలు తమకు ఎదురవుతున్న సమస్యలను నేరుగా ప్రజావాణి ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు అందుబాటులో ఉన్న వేదిక అని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎంపీడీవో కోరారు.