భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట ఎంపీడీవో సాజిలోద్దీన్ సూచించారు. సోమవారం రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో సాజిలోద్దీన్ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 8 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వీటిలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒకటి, మున్సిపల్ శాఖకు సంబంధించి ఒకటి, రెవెన్యూ శాఖకు సంబంధించి నాలుగు అర్జీలు…