భారత్ సమాచార్, రాజన్నసిరిసిల్ల జిల్లా: తెలంగాణలోనే అతి పెద్ద శైవ క్షేత్రమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించడానికి వివిధ రకాల పనులు ప్రభుత్వ సహకారంతో ఎండోమెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అందులో భాగంగా రాజన్న ఆలయ మూసివేతపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంలో ఎప్పుడు మూసివేసేది త్వరలోనే స్పష్టం చేస్తానని ప్రభుత్వ పెద్దలు అధికారులు తెలపడం జరిగిందని, మూసివేత అనేది దసరా తర్వాతన, ముందా అనేది ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని బిజెపి నాయకులు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఎన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తారో వివరణ ఇవ్వాలని, అభివృద్ధిలో భాగంగా గుడి లోపల దర్గాను కూడా మార్చాలని, దర్గాను ముట్టుకోకుండా హిందూ దేవాలయ విగ్రహాలను ముట్టుకుంటే ఊరుకునేది లేదన్నారు. దేవాలయం మూసివేతతో ప్రత్యక్షంగా 500 కుటుంబాలు పరోక్షంగా 3000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుందని, ఆ కుటుంబాలను ఆదుకొని వారికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే దేవాలయ అభివృద్ధిని ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో స్పష్టంగా తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రేగుల మల్లికార్జున్, కోల కృష్ణస్వామి,రేగుల శ్రీకాంత్ తదితరులున్నారు.