భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: మద్దిరాల పోలీస్ స్టేషన్‌ను సూర్యాపేట DSP వి. ప్రసన్న కుమార్ సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ ఫైళ్లు, ఇతర ముఖ్యమైన పత్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
తనిఖీలో భాగంగా పోలీస్ కానిస్టేబుళ్లతో మాట్లాడిన DSP.. వారి పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పోలీస్ అధికారులు (VPOలు) తమ తమ గ్రామాల్లో అనుమానితుల జాబితాలో ఉన్న వ్యక్తులు, రౌడీ షీటర్లు, ఇతర సంఘవిద్రోహ శక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
గ్రామస్థాయిలో ఇంటెలిజెన్స్ సమాచారాన్ని క్రమం తప్పకుండా సేకరించాలని, అందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది ప్రజలు, ఫిర్యాదుదారులతో మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, ప్రతి ఒక్కరికీ సులభంగా అందుబాటులో ఉండాలని DSP సూచించారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ ఫైళ్లతో పాటు ఇతర ముఖ్యమైన పత్రాలను తనిఖీ చేశారు. UI కేసుల పురోగతిని కూడా సమీక్షించారు.
పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును ఎలాంటి లోపాలు, అవకతవకలకు తావులేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ కిట్‌లోని వస్తువులను పరిశీలించి, వాటిని సక్రమంగా వినియోగించాలని తెలిపారు.