భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: మద్దిరాల పోలీస్ స్టేషన్‌ను సూర్యాపేట DSP వి. ప్రసన్న కుమార్ సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, రిజిస్టర్లు, క్రైమ్ ఫైళ్లు, ఇతర ముఖ్యమైన పత్రాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

తనిఖీలో భాగంగా పోలీస్ కానిస్టేబుళ్లతో మాట్లాడిన DSP.. వారి పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పోలీస్ అధికారులు (VPOలు) తమ తమ గ్రామాల్లో అనుమానితుల…