భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

నార్సింగి కస్తూర్బా పాఠశాలలో ఉద్యోగాల భర్తీ.. మహిళలకు అవకాశం

కస్తూర్బా పాఠశాలలో ఉద్యోగ ఖాళీలు  అర్హులైన మహిళల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేక అధికారి మమత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు గెస్ట్ టీచర్, అటెండర్, నైట్ వాచ్ ఉమెన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

పోస్టులు, అర్హతలు, వేతనాల వివరాలు

తెలుగు గెస్ట్ టీచర్ పోస్టుకు B.Ed పూర్తి చేసి, TET అర్హత కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని మమత తెలిపారు. ఈ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు ₹.18,000 వేతనం చెల్లించనున్నారు. అటెండర్, నైట్ వాచ్ ఉమెన్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులని, ఎంపికైన వారికి నెలకు ₹.9,750 వేతనం అందించనున్నట్లు పేర్కొన్నారు.

నవంబర్ 6 చివరి గడువు

ఆసక్తి, అర్హత కలిగిన మహిళలు నవంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు సాయంత్రం 4 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రత్యేక అధికారి కోరారు. ఈ పోస్టులకు నార్సింగి మండలానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు.

దరఖాస్తులను చేగుంట మండలం రెడ్డిపల్లిలో నిర్వహిస్తున్న నార్సింగి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అందజేయాలని సూచించారు. పోస్టులకు సంబంధించిన ఇతర వివరాల కోసం 8555850581 నంబరును సంప్రదించాలని మమత కోరారు.