భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

2, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఖాజాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం.. గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు

ఖాజాపూర్‌లో ఉచిత వైద్య శిబిరం..  బీపీ, షుగర్ తదితర వ్యాధులకు ఉచిత పరీక్షలు.. మందుల పంపిణీ..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మమత హాస్పిటల్, బాచుపల్లి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు గ్రామస్థులకు బీపీ, షుగర్‌తో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్లు జాగృతి, శ్రేయ, ప్రగతి, భవిష్య, ఇన్‌చార్జి అనంతరావు, లోకేష్, స్థానిక సర్పంచ్ బాలస్వామి, కర్రె శ్రీనివాస్, వినయ్ గౌడ్, లకావత్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.