భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మమత హాస్పిటల్, బాచుపల్లి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ శిబిరంలో పాల్గొన్న వైద్యులు గ్రామస్థులకు బీపీ, షుగర్‌తో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ…






