భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

3, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

రెండేళ్ల అనుబంధానికి వీడ్కోలు.. ఎస్‌ఐ బాలరాజు సేవలకు ప్రశంసలు

రామాయంపేట ఎస్సై బాలరాజు సేవలు మరువలేని

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో రెండేళ్లకు పైగా సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన డి. బాలరాజు ప్రజల మన్ననలు పొందారని బీజేపీ నాయకులు తెలిపారు. విధి నిర్వహణలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన బదిలీ కావడం బాధాకరమని పేర్కొన్నారు.

రామాయంపేట ఎస్సై బాలరాజు సేవలు మరువలేని

పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలుగుతూ ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు. ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. పోలీస్ విధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు.

సమాజ సేవ లక్ష్యంగా గ్రామాల్లో నిర్వహించిన పలు సామాజిక కార్యక్రమాల్లో ముందుండి పాల్గొన్నారని, యువతకు మంచి మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు. రెండేళ్లకు పైగా రామాయంపేట మండల ప్రజలతో ఆయన ఏర్పరచుకున్న అనుబంధం, ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఆయన సేవలకు నిదర్శనమని అన్నారు.

రామాయంపేట ఎస్సై బాలరాజు సేవలు మరువలేని

ఉద్యోగ ధర్మంలో భాగంగా బదిలీపై వెళ్తున్న బాలరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఎక్కడ విధులు నిర్వహించినా ఇదే అంకితభావంతో ప్రజలకు సేవలందిస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని భారతీయ జనతా పార్టీ తరఫున ఆకాంక్షించారు. రామాయంపేట ప్రజలకు ఆయన అందించిన సేవలు, సంపాదించుకున్న ఆదరాభిమానాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగి రాములు, అక్కన్నపేట సర్పంచ్ బక్కయ్య, యాదగిరి, మాజీ పట్టణ అధ్యక్షుడు భానుచందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి అక్కలా అనిల్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మెంగర్తి రంగయ్య, పట్టణ నాయకులు బండి గిరి, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు నాగరాజు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.