భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో రెండేళ్లకు పైగా సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలందించిన డి. బాలరాజు ప్రజల మన్ననలు పొందారని బీజేపీ నాయకులు తెలిపారు. విధి నిర్వహణలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన బదిలీ కావడం బాధాకరమని పేర్కొన్నారు.

పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలుగుతూ ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు. ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. పోలీస్ విధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా…