భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

బాధిత కుటుంబానికి రాజిరెడ్డి చేయూత

మృతుడి కుటుంబానికి సంఘ సేవకుడు విగ్గు గారి రాజిరెడ్డి ఆర్థిక సాయం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ప్రముఖ సంఘ సేవకుడు వెంకు గారి రాజిరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం దుర్గ గౌడ్ అనారోగ్య కారణాలతో మంగళవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాజిరెడ్డి, మృతుడి కుటుంబానికి ₹.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

స్థానిక నాయకుల ద్వారా ఈ ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి బాధలో తాము పాలుపంచుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కీసర రాజా గౌడ్, సాయిల నరేష్, గుర్రం స్వామి గౌడ్, గుర్రం యాదగౌడ్, చిన్న స్వామి గౌడ్, ప్రకాష్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.