భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన హరీష్ వర్ధన్ ముదిరాజ్‌ను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరీష్ వర్ధన్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియజేయడంతో పాటు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనట్లు పేర్కొంటూ నియామక పత్రాన్ని అందజేశారు.
విద్యార్థి రాజకీయాల్లో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర స్థాయి పదవిని అందుకోవడం అభినందనీయమని ఆవుల రాజిరెడ్డి తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, యువత హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తూ NSUI బలోపేతానికి మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా హరీష్ వర్ధన్ మాట్లాడుతూ.. తనకు ఈ స్థాయి గుర్తింపు రావడంలో ప్రోత్సాహం, సహకారం అందించిన ఆవుల రాజిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.