భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన హరీష్ వర్ధన్ ముదిరాజ్‌ను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరీష్ వర్ధన్‌కు శాలువా కప్పి అభినందనలు తెలియజేయడంతో పాటు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైనట్లు పేర్కొంటూ నియామక పత్రాన్ని అందజేశారు.
విద్యార్థి రాజకీయాల్లో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించి రాష్ట్ర స్థాయి పదవిని అందుకోవడం…






