భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలి: అశోక్ గౌడ్

పట్టభద్రులందరూ ఓటు నమోదు చేయించుకోవాలి              కాంగ్రెస్ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు ఉన్న ఒక్క పట్టభద్రుడు కూడా నమోదు ప్రక్రియలో మిస్ కాకుండా చూడాలని సూచించారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లిలో ముమ్మరంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను బుధవారం అశోక్ గౌడ్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ఇన్‌చార్జిలు కొట్టం రాము, నందునూరి ప్రశాంత్‌లతో మాట్లాడారు. అర్హులైన పట్టభద్ర యువత అందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 6వ తేదీతో ఓటరు నమోదు గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పట్టభద్రులు స్వయంగా ముందుకు వచ్చి తమ ఓటును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించుకుందాం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామ్‌రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని, విద్యా, ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూరెల్లి సతీష్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు మామిడి జనార్దన్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోత్ సూర్య తదితరులు పాల్గొన్నారు.