భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, నవంబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఆరా

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఆరా

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడంపై కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో బుధవారం నెల్లికుదురు మండలంలోని నైనాల, పార్వతమ్మగూడెం గ్రామాల్లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. తరగతి గదులు, పాఠశాల పరిసరాలు, టాయిలెట్లను పరిశీలించడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను తనిఖీ చేశారు.

తరగతి గదుల్లోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి వారి చదువు, అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. FLN (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ)లో భాగంగా నిర్వహిస్తున్న స్పాట్ అసెస్‌మెంట్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలకు సంబంధించిన అంశాల్లో పిల్లల ప్రస్తుత స్థాయిని అంచనా వేశారు.

విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఆరా

క్షేత్రస్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. నూతన విద్యా విధానం, డిజిటల్ తరగతుల ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి, వారికి అవసరమైన శిక్షణ, బోధనా పద్ధతులను గుర్తించేందుకు స్పాట్ అసెస్‌మెంట్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.

మళ్లీ సందర్శిస్తా.. విద్యార్థుల సామర్థ్యాలు పెరగాలి

జిల్లాలో విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై నైపుణ్యం పెంపొందించేందుకు LEAF, FLN వంటి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయులు నిరంతరం అంచనా వేస్తూ, వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలని సూచించారు. తాను మళ్లీ పాఠశాలలను సందర్శించే సమయానికి ప్రతి విద్యార్థి విద్యా సామర్థ్యం మెరుగుపడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఆరా

విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ప్రభుత్వం పలు సౌకర్యాలు కల్పిస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు వసతి గృహాల్లో కామన్ డైట్ మెనూను పక్కాగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్ అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

అదనపు తరగతి గదుల నిర్మాణానికి పరిశీలన

నైనాల UPSలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు సరిపోవడం లేదని గుర్తించిన కలెక్టర్, ఈ సమస్యపై గతంలో ప్రతిపాదనలు పంపారా? ఉన్నతాధికారులు లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారా? అని స్థానిక హెచ్‌ఎం హెచ్చు నరేంద్ర కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గతంలో పలుమార్లు కలెక్టర్లు, ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, తరగతి గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారని హెచ్‌ఎం వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ACG మందుల శ్రీరాములు, MEO రాందాస్, AAMO వెంకటేశ్వర్లు, ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ సభ్యుడు యాదగిరి, సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.