భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచడంపై కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో బుధవారం నెల్లికుదురు మండలంలోని నైనాల, పార్వతమ్మగూడెం గ్రామాల్లో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. తరగతి గదులు, పాఠశాల పరిసరాలు, టాయిలెట్లను పరిశీలించడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను తనిఖీ చేశారు.
తరగతి గదుల్లోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి వారి చదువు, అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు.…





