భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. ఎస్సై బాలరాజు

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. ఎస్సై బాలరాజు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితిని మార్చి, ప్రజలు తమ సమస్యలను ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిన అధికారి ఎస్సై బాలరాజు అని రామాయంపేట ప్రెస్ క్లబ్ (TUWJ) అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం అన్నారు. రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో 27 నెలల పాటు ఎస్సైగా విధులు నిర్వహించిన బాలరాజు తన ప్రత్యేక పనితీరుతో ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు. అధికారులకు బదిలీలు సహజమే అయినప్పటికీ, ప్రజలతో మమేకమై సేవలందించిన ఇలాంటి అధికారి బదిలీ కావడం బాధాకరమని పేర్కొన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. ఎస్సై బాలరాజు

గతంలో ఏదైనా సమస్య ఎదురైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలా? పోలీసులకు చెబితే ఎలా స్పందిస్తారు? అనే సందేహాలు, భయాలు ప్రజల్లో ఉండేవని మల్లేశం గుర్తుచేశారు. అయితే ఎస్సై బాలరాజు రామాయంపేటలో బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. ప్రజలు తమకు ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను సైతం నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెప్పుకునేలా ధైర్యాన్ని కల్పించారని తెలిపారు. సమస్య చిన్నదైనా నిర్లక్ష్యం చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచడం ఆయన ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనమని అన్నారు.

పోలీసుల విధులు కేవలం నేరాలను అరికట్టడం, కేసులు నమోదు చేయడం మాత్రమే కాదని, ప్రజలకు భరోసా కల్పించడం, బాధితులకు అండగా నిలవడం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే దిశగా కృషి చేయడం కూడా ముఖ్యమని మల్లేశం పేర్కొన్నారు. ఈ విషయంలో బాలరాజు ప్రజలతో మమేకమవుతూ అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించారని చెప్పారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. ఎస్సై బాలరాజు

ప్రజలు పోలీస్ స్టేషన్‌ను తమ సమస్యలను చెప్పుకునే వేదికగా భావించేలా చేయడం, పోలీసుల పట్ల ఉన్న భయాన్ని తగ్గించి నమ్మకాన్ని పెంపొందించడం అభినందనీయమన్నారు. 27 నెలల పాటు రామాయంపేట ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన అందించిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపారు. విధి నిర్వహణలో చూపిన చొరవ, ప్రజలతో కొనసాగించిన సత్సంబంధాలు మరువలేనివని బసన్నపల్లి మల్లేశం అన్నారు.

పోలీస్ శాఖపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాలరాజు వంటి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. ఎస్సై బాలరాజు

ఈ కార్యక్రమంలో TUWJ జిల్లా ఉపాధ్యక్షుడు పాతూరి రమేష్ గౌడ్, రామాయంపేట ప్రెస్ క్లబ్ (TUWJ) ఉపాధ్యక్షులు తుజాల శ్రీనివాస గౌడ్, కర్రె నరేందర్, కోశాధికారి రంగా రాజకిషన్, సభ్యులు బల్ల యాదగిరి, తుడుం పెంటయ్య, సార్గు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Do you like this personality?