భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితిని మార్చి, ప్రజలు తమ సమస్యలను ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిన అధికారి ఎస్సై బాలరాజు అని రామాయంపేట ప్రెస్ క్లబ్ (TUWJ) అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం అన్నారు. రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో 27 నెలల పాటు ఎస్సైగా విధులు నిర్వహించిన బాలరాజు తన ప్రత్యేక పనితీరుతో ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు. అధికారులకు బదిలీలు సహజమే అయినప్పటికీ, ప్రజలతో మమేకమై సేవలందించిన ఇలాంటి అధికారి బదిలీ కావడం బాధాకరమని…