భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, నవంబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రగ్బీ పోటీల్లో మెదక్ జోరు.. అండర్-18లో రాష్ట్రస్థాయి ఛాంపియన్!

రాష్ట్రస్థాయి కె లో ఇండియా అస్మితల్ రబ్జి పోటీల విజేతలు మెదక్ ఖమ్మం

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా అస్మిత రగ్బీ పోటీల్లో ఖమ్మం, మెదక్ జిల్లాల బాలికలు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-15 విభాగంలో ఖమ్మం జిల్లా మొదటి స్థానం సాధించగా, అండర్-18 విభాగంలో మెదక్ జిల్లా విజేతగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా వోక్సన్ యూనివర్సిటీ గ్రౌండ్‌లో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించారు.

అండర్-15 విభాగంలో ఖమ్మం విజయం

అండర్-15 బాలికల విభాగంలో ఖమ్మం, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, కరీంనగర్, వనపర్తి, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, జనగాం, పెద్దపల్లి, మేడ్చల్, మెదక్, వరంగల్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలతో కలిపి మొత్తం 16 జిల్లాల జట్లు పోటీపడ్డాయి. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లలో ఖమ్మం జిల్లా మొదటి స్థానం కైవసం చేసుకోగా, నల్గొండ రెండో స్థానం, వనపర్తి మూడో స్థానం సాధించాయి.

అండర్-18లో మెదక్ జిల్లా ఛాంపియన్

అండర్-18 విభాగంలో ఖమ్మం, వరంగల్, ఆసిఫాబాద్, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, వనపర్తి, పెద్దపల్లి, మెదక్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాలతో కలిపి మొత్తం 12 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. ఈ విభాగంలో మెదక్ జిల్లా అద్భుత ప్రదర్శనతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలవగా, ఖమ్మం జిల్లా మూడో స్థానాన్ని సాధించింది.

పోటీలకు హాజరైన ప్రముఖులు

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆదిత్య, వోక్సన్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఇన్‌చార్జి విశాల్, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కరణం గణేష్ రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రగ్బీ ఇండియా అబ్జర్వర్ నోయెల్ మ్యాథ్యూ, ఫిజియో డాక్టర్ అర్జున్ ప్రసాద్, డాక్టర్ రాంబాబు, రగ్బీ టెక్నికల్ ఇన్‌చార్జి సాయి చరణ్, శేషు, శ్రీధర్, మహేష్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఖమ్మం, మెదక్ జిల్లా బాలికలను క్రీడాభిమానులు అభినందించారు.