భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలలపై జరిగే నేరాలను నియంత్రించడంతో పాటు బాల్యవివాహాలు, అక్రమ రవాణా, శారీరక, మానసిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు (VCPС) ఏర్పాటు చేస్తున్నట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎన్. సరిత తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులకు బాలల భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ కమిటీలు కీలకంగా పనిచేస్తాయని చెప్పారు.
ఈ క్రమంలో గురువారం మండలంలోని మునిగలవీడు ZPHSలో సమావేశం నిర్వహించి గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా స్థానిక సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజును, కన్వీనర్‌గా వీరలక్ష్మిని నియమించారు. వీరితో పాటు మరో 15 మందిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ ప్రభుత్వం ఐసిడిఎస్, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కిషోర బాలికలకు అందిస్తున్న సేవలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలికలు, పిల్లలు ఇతరుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆలస్యం చేయకుండా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం స్వప్న, పంచాయతీ కార్యదర్శి వెంకన్న, NGO సోమన్న, సంఘ సభ్యులు సింధు, ఎం. యాకయ్య, అంగన్‌వాడీ టీచర్ జమాల్బి, మహతి, సరోజినీ, వెంకటమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.