భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

రామాయంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నిరుపేదలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మెదక్ MLA డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. ఈ మేరకు రామాయంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, పట్టాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందుతూ ఆర్థికంగా లబ్ధి పొందాలని కోరారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

అనంతరం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో గొల్పర్తి నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం ₹.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

అనంతరం రామాయంపేట పట్టణ, మండల పరిధిలో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 37 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 96 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలోని నిరుపేదలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి అప్పులపాలు చేసిందని, కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాజవాడ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు, పుట్టి సందీప్, దేవుని రంజిత్, డాకి శ్యామల స్వామి, బైరం స్వప్న కుమార్, రవి నాయక్, చింతల యాదగిరి, తహసీల్దార్ రజిని కుమారి, RI గౌస్, తోట వారి యాదగిరి, బండారి మహేందర్ రెడ్డి, ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ మానెగండ్ల రామకృష్ణయ్య, సుతార్ పల్లి సర్పంచ్ సునీల్, కార్య నాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.