భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, నవంబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

గర్భిణీలు, బాలింతలు అంగన్వాడి సేవలు పొందాలి

అంగన్వాడి సెంటర్ల సేవలు వినియోగించుకోవాలి                            సర్పంచి అశోక్ కుమార్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హనుమాన్ నగర్ తండా సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ సూచించారు. పిల్లల భద్రత, సంరక్షణకు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ తండాలో శుక్రవారం ICDS అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (విసిపిసి)ని ఏర్పాటు చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో ఈ కమిటీని రూపొందించగా, కన్వీనర్‌గా సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణలో గ్రామస్థాయి కమిటీ పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందే సేవలను గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.

ICDS సూపర్వైజర్ సుధారాణి మాట్లాడుతూ.. పిల్లలపై జరిగే నేరాలను నియంత్రించడం, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణాను అరికట్టడం, శారీరక, మానసిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులకు ఈ అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు బాలల హక్కులు, భద్రతపై చైతన్యం తీసుకురావడానికి విసిపిసి కృషి చేస్తుందని వివరించారు.

బాలికలు, చిన్నారులకు ఇతరుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆలస్యం చేయకుండా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని సుధారాణి సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, అంగన్వాడీ టీచర్లు గుగులోతు శారద, గుగులోతు మైబు, జయశ్రీ, ఆశా వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.