భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి: డాక్టర్ రాధాకిషన్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని మాజీ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఆశించిన విజయాలను సాధించగలరని తెలిపారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని PM శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ‘ఎక్స్పర్ట్ టాక్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ హాజరై విద్యార్థులకు చదువు, పరీక్షల సన్నద్ధత, భవిష్యత్తు లక్ష్యాలపై అవగాహన కల్పించారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. పరీక్షల సమయంలో మంచి ఆహారం తీసుకోవడంతోపాటు, ప్రశ్నలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని సమాధానాలు రాయడానికి సిద్ధం కావాలని తెలిపారు. కేవలం చదవడం మాత్రమే కాకుండా, ప్రశ్నల సరళిని గుర్తించి అవగాహనతో అభ్యసించినప్పుడే మంచి ఫలితాలు సాధించడంతోపాటు ఉన్నత స్థాయికి ఎదగగలరని చెప్పారు.

విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటిని చేరుకునేందుకు నిరంతరం కృషి చేయాలని రాధాకిషన్ సూచించారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల విద్యాధికారి నీరజ, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్, రఘుపతి, చల్లా లక్ష్మణ్, రమ, సురేందర్, సరస్వతి, రావుల వెంకటేష్, శ్రీవాణి, మనోహర్ రావు, ఉమాదేవి, ఉమామహేశ్వరి, హిమవర్ష, రజిత, శ్రీకాంత్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.