భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని మాజీ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఆశించిన విజయాలను సాధించగలరని తెలిపారు.

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని PM శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ‘ఎక్స్పర్ట్ టాక్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ హాజరై విద్యార్థులకు చదువు, పరీక్షల సన్నద్ధత, భవిష్యత్తు లక్ష్యాలపై అవగాహన…