భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

కేటీఆర్‌‌ను కలిసిన పద్మాదేవేందర్‌రెడ్డి

కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మాజీ ఉపసభాపతి ఎం. పద్మ దేవేందర్‌రెడ్డి శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి

అనంతరం రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ కుమార్తె రోషిణి వివాహ ఆహ్వాన పత్రికను పద్మ దేవేందర్‌రెడ్డి కేటీఆర్‌కు అందజేశారు. రోషిణి వివాహం గిరీష్‌గౌడ్‌తో నవంబర్ 15న హైదరాబాద్‌లోని మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో ఉన్న అద్వయ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కేటీఆర్‌ను ఆమె ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, రామాయంపేట మాజీ ఎంపీపీ పుట్టి యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగ నరేందర్, మాజీ కోఆప్షన్ సభ్యుడు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.