భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మాజీ ఉపసభాపతి ఎం. పద్మ దేవేందర్‌రెడ్డి శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

అనంతరం రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ కుమార్తె రోషిణి వివాహ ఆహ్వాన పత్రికను పద్మ దేవేందర్‌రెడ్డి కేటీఆర్‌కు అందజేశారు. రోషిణి వివాహం గిరీష్‌గౌడ్‌తో నవంబర్ 15న హైదరాబాద్‌లోని మేడ్చల్ మండలం మునీరాబాద్‌లో ఉన్న అద్వయ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.…