భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ఎల్ నినో ఎఫెక్ట్‌పై అలర్ట్.. రైతులకు ఎమ్మెల్యే కీలక సూచనలు

ఎల్ నినో పట్ల అప్రమత్తంగా ఉండాలి                          ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రజాప్రతినిధులు అధి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ సూచించారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని పంటల సాగుపై నిర్ణయం తీసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం మండల సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, వివిధ శాఖల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సమావేశానికి హాజరుకాని సర్పంచులపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఇకపై ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే సంబంధిత గ్రామాలకు కేటాయించే అభివృద్ధి నిధుల్లో కోత విధిస్తామని హెచ్చరించారు.

ఎల్ నినో పట్ల అప్రమత్తంగా ఉండాలి                          ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రజాప్రతినిధులు అధి

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి సాగు పట్ల రైతులకు పరిస్థితులను వివరించి, ఈసారి వరి సాగును నియంత్రించేలా అవగాహన కల్పించాలన్నారు.

VBG రాంజీ పనులపై ప్రత్యేక దృష్టి

VBG రాంజీ పథకం కింద గుర్తించిన 375 పనుల్లో గ్రామాలకు అవసరమైన పనులను చేపట్టేందుకు సర్పంచులు, అధికారులు చొరవ చూపాలని మురళి నాయక్ సూచించారు. ఈ పనుల ద్వారా కూలీలకు ఎక్కువ ఉపాధి లభించేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. పథకం పనులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు విడుదల చేస్తాయని వివరించారు. అంతకుముందు స్పెషల్ ఆఫీసర్ మల్లేశ్వరి పథకం పనులపై సమావేశంలో వివరించారు.

ఎల్ నినో పట్ల అప్రమత్తంగా ఉండాలి                          ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రజాప్రతినిధులు అధి

పంచాయతీ కార్యదర్శిని మార్చాలని సర్పంచ్ విజ్ఞప్తి

ఇనుగుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సమయపాలన పాటించడం లేదని స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఇనుగుర్తిలో కార్యదర్శి పనితీరు కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని ఆరోపించారు. ఆమెను వెంటనే అక్కడి నుంచి మార్చి మరో కార్యదర్శిని నియమించాలని ఎమ్మెల్యేను కోరారు.

అనంతరం ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, స్పెషల్ ఆఫీసర్ మల్లేశ్వరి, తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, MPDO బండారు పార్థసారథి, AO షేక్ యాస్మిన్, MEO విన్న వెంకటరెడ్డి, దిశ కమిటీ సభ్యుడు గుజ్జునూరి బాబురావు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.