భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ సూచించారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని పంటల సాగుపై నిర్ణయం తీసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం మండల సర్పంచులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, వివిధ…