భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. మహబూబాబాద్ జిల్లా TRSMA ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా జమాండ్లపల్లిలోని విద్యాభారతి హైస్కూల్‌లో నిర్వహించిన టోర్నమెంట్‌లో వివిధ విభాగాల్లో పాల్గొని ఏకంగా ఐదు బహుమతులు సాధించారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్‌తో పాటు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. TRSMA జిల్లా అధ్యక్షుడు డా. చిర్ర యాకాంతం గౌడ్, జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భారతి చేతుల మీదుగా విజేతలు బహుమతులు అందుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ.. విద్యార్థులను చదువుతోపాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టోర్నమెంట్‌కు తీసుకెళ్లినట్లు తెలిపారు. పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఐదు బహుమతులు సాధించడం ఆనందంగా ఉందన్నారు.
విజేతలుగా నిలిచిన నునావత్ రిషి, ముల్క కార్తీక, బూర ఆయన్ తేజ్, ఎండి తహసీన్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీచర్ శ్రీలత పాల్గొన్నారు.