భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. మహబూబాబాద్ జిల్లా TRSMA ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా జమాండ్లపల్లిలోని విద్యాభారతి హైస్కూల్లో నిర్వహించిన టోర్నమెంట్లో వివిధ విభాగాల్లో పాల్గొని ఏకంగా ఐదు బహుమతులు సాధించారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్‌తో పాటు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. TRSMA జిల్లా అధ్యక్షుడు డా. చిర్ర యాకాంతం గౌడ్, జిల్లా రవాణా శాఖ అధికారి…






