భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, నవంబర్ 2026, శనివారంభారత్ సమాచార్

పేదింట్లో పండుగ సంతోషం పంచుకున్న ఎమ్మెల్యే మురళి నాయక్

దీపావళి సంబరాల్లో ఎమ్మెల్యే మురళి నాయక్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి సంతోషాలు నింపేలా ఇనుగుర్తి మండల కేంద్రంలో ముందస్తు పండుగ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారుడి నివాసంలో జరిగిన దీపావళి సంబరాలకు ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ హాజరయ్యారు. గృహస్తులతో కలిసి కాకర్స్ కాల్చి, మతాబులు వెలిగిస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

దీపావళి సంబరాల్లో ఎమ్మెల్యే మురళి నాయక్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో నిర్వహిస్తున్న ముందస్తు దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలన్నింటికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ వారి సొంతింటి కలను నెరవేరుస్తోందని, పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మల్లేశ్వరి, తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, MPDO పార్థసారథి, స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, దిశా కమిటీ సభ్యుడు గుజ్జునూరి బాబురావు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.