భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో దీపావళి సంతోషాలు నింపేలా ఇనుగుర్తి మండల కేంద్రంలో ముందస్తు పండుగ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం ఇందిరమ్మ ఇల్లు పొందిన లబ్ధిదారుడి నివాసంలో జరిగిన దీపావళి సంబరాలకు ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ హాజరయ్యారు. గృహస్తులతో కలిసి కాకర్స్ కాల్చి, మతాబులు వెలిగిస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల్లో నిర్వహిస్తున్న ముందస్తు దీపావళి వేడుకల్లో…