భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

9, నవంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

"నిషాభగత్" ఆత్మహత్యకు కారణమైన ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలి..

"నిషాభగత్" ఆత్మహత్యకు కారణమైన ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలి..

భార‌త్ స‌మాచార్, మహబూబాబాద్ : గిరిజన మహిళ నిషా భగత్ మరణానికి జార్ఖండ్‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ, ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని బీజేపీ జిల్లా యువ నాయకుడు గుగులోతు నవీన్ నాయక్ డిమాండ్ చేశారు. మత మార్పిడులకు వ్యతిరేకంగా గళం విప్పినందుకే ఆమెను వేధింపులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిషా భగత్‌పై జార్ఖండ్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 21 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, వాటి కారణంగా ఆమె తరచూ పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వచ్చిందని నవీన్ నాయక్ పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర ఒత్తిడికి గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉండటంతోనే ఈ వ్యవహారంలో సంబంధిత పార్టీలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు.

"నిషాభగత్" ఆత్మహత్యకు కారణమైన ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలి..

నిషా భగత్ మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇండియా కూటమి, వామపక్ష నాయకులు స్పందించకపోవడం బాధాకరమని నవీన్ నాయక్ అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఆందోళనలు నిర్వహించే పార్టీలు, ఇప్పుడు తమ మిత్రపక్షం పాలనలో జరిగిన ఘటనపై స్పందించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు.

నిషా భగత్ మృతిని న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని నవీన్ నాయక్ కోరారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి ఘటనలపై పార్టీలకు అతీతంగా స్పందించాలని ఆయన కోరారు.