భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నెల్లికుదురు మండల అడహాక్ కమిటీని మంగళవారం మండల కేంద్రంలోని పూర్వ శాంతినికేతన్ స్కూల్‌లో ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు అలవాలా శ్రీనివాస్, జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్ అలవాలా ఉపేందర్, కో-కన్వీనర్ సముద్రాల సోమయ్య, కొత్తపల్లి రమేష్ సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో మండల అడహాక్ కమిటీ కన్వీనర్‌గా రుద్రరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పోతుగంటి శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. కమిటీ సభ్యులుగా పోతుగంటి రవి, వాడ్కాపురం నర్సయ్య, మల్యాల ఐలయ్య, రుద్రరాపు ఉప్పలయ్య, పాలాభిందేలా మహేష్‌లను ఎన్నుకున్నారు. సంఘం బాధ్యతలను సమర్థంగా నిర్వహించేలా నూతన కమిటీని ఎంపిక చేసినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన కన్వీనర్‌గా ఎంపికైన రుద్రరాపు రవికుమార్ మాట్లాడుతూ.. కుమ్మర సామాజిక వర్గ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తామని తెలిపారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సామాజిక వర్గానికి రావాల్సిన హక్కులు, న్యాయమైన ప్రయోజనాల సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు.
తనపై నమ్మకంతో కమిటీ బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకులకు, ఎన్నికలకు సహకరించిన సంఘం ప్రతినిధులకు, కుమ్మర కులస్తులకు రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారం, సూచనలతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మల్యాల నర్సయ్య, సముద్రాల వెంకన్న, బొడ్డుపెల్లి వెంకన్న, అలవాల శ్రీశైలం తదితరులతో పాటు పలువురు కుమ్మర సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.