భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

కాంగ్రెస్ నేత బాలాజీ నాయక్‌కు నాయకుల పరామర్శ

కాంగ్రెస్ జిల్లా నేత బాలాజీ నాయక్ కు పరామర్శ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రత్తిరారాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత గుగులోతు బాలాజీ నాయక్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి దస్రు నాయక్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం రత్తిరారాం గ్రామానికి చేరుకుని బాలాజీ నాయక్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలాజీ నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాధను పంచుకున్నారు. కుటుంబానికి ధైర్యం చెబుతూ, ఇలాంటి కష్ట సమయంలో మనోనిబ్బరాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. బాలాజీ నాయక్‌కు, ఆయన కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.

బాలాజీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి దస్రు నాయక్‌కు నివాళులర్పించిన వారిలో బోటిమీది తండా సర్పంచ్ రామ్ సింగ్ నాయక్, సీతారామపురం సర్పంచ్ ధారావతు భాస్కర్ నాయక్, నల్లగుట్ట తండా సర్పంచ్ హేమలత శ్రీను, దుర్గా భవాని తండా సర్పంచ్ వీరన్న నాయక్, రాజ్య తండా సర్పంచ్ ధారావతు విజయ ఆనంద్, జాటోతు వీరన్న తదితరులు పాల్గొన్నారు.