భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడంతో పాటు బాలల హక్కులు, భద్రతపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు VCPС కమిటీలను ఏర్పాటు చేశారు. నెల్లికుదురు మండలంలోని నెల్లికుదురు గ్రామం, దుర్గాభవాని తండాలో మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన బాలల పరిరక్షణ కమిటీలను ఎన్నుకున్నారు.
నెల్లికుదురు గ్రామంలో కమిటీ ఎన్నిక
మండల కేంద్రం నెల్లికుదురు అంగన్వాడీ సెక్టార్ పరిధిలోని నెల్లికుదురు గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (VCPС) చైర్మన్‌గా గ్రామ సర్పంచ్ పులి వెంకన్న, కన్వీనర్‌గా స్థానిక అంగన్వాడీ టీచర్ మద్ది విజయ వ్యవహరించనున్నారు. ఈ మేరకు ICDS సూపర్వైజర్ ఎన్. సరిత సమక్షంలో స్థానిక ZPHSలో 15 మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ.. పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడంలో VCPС కమిటీలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయని చెప్పారు. బాలల అక్రమ రవాణా, బాల్యవివాహాలు వంటి ఘటనలను నిరోధించడంలో కమిటీ సభ్యులు చురుగ్గా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పులి వెంకన్న, HM జలగం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి దేవయ్య, ఉపసర్పంచ్ మంచాల వెంకన్న, AFPC చైర్మన్ మమత, జహీర్ పాషా, అంగన్వాడీ టీచర్లు ఐ. పద్మ, ఎం. పద్మ, కె. పద్మ, టి. జ్యోతి, మాధవి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
దుర్గాభవాని తండాలోనూ కమిటీ ఏర్పాటు
మండలంలోని దుర్గాభవాని తండా గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని కూడా ICDS నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్. సరిత ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. భగ్న తండా పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో VCPС చైర్మన్‌గా స్థానిక సర్పంచ్ వీరన్న నాయక్, కన్వీనర్‌గా అంగన్వాడీ టీచర్ బి. పద్మను ఎంపిక చేశారు. వీరితో పాటు మొత్తం 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ANM యశోద, ఆశా కార్యకర్త విజయ, బాలల సంఘం సభ్యురాలు కావ్య, అంగన్వాడీ టీచర్ సునిత తదితరులు పాల్గొన్నారు.