భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడంతో పాటు బాలల హక్కులు, భద్రతపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు VCPС కమిటీలను ఏర్పాటు చేశారు. నెల్లికుదురు మండలంలోని నెల్లికుదురు గ్రామం, దుర్గాభవాని తండాలో మంగళవారం 15 మంది సభ్యులతో కూడిన బాలల పరిరక్షణ కమిటీలను ఎన్నుకున్నారు.

నెల్లికుదురు గ్రామంలో కమిటీ ఎన్నిక

మండల కేంద్రం నెల్లికుదురు అంగన్వాడీ సెక్టార్ పరిధిలోని నెల్లికుదురు గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (VCPС) చైర్మన్‌గా గ్రామ సర్పంచ్ పులి వెంకన్న, కన్వీనర్‌గా స్థానిక అంగన్వాడీ టీచర్ మద్ది…