భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆలేరు విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు.

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలోని ZPHS విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన యశ్వంత్ సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు, గణేష్ తేజ్ సెపక్ తక్రా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు MEO, పాఠశాల HM ఆంగోతు రాందాస్ తెలిపారు.

మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ నెల 13వ తేదీ నుంచి నిజామాబాద్‌లో నిర్వహించనున్న సాఫ్ట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో యశ్వంత్ పాల్గొననున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ నెల 12వ తేదీ నుంచి జనగామలో జరగనున్న SGF రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున గణేష్ తేజ్ ప్రాతినిధ్యం వహించనున్నట్లు చెప్పారు.

విద్యార్థులకు అభినందనలు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను MEO రాందాస్‌తో పాటు పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. వారు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్‌ను కూడా ఈ సందర్భంగా అభినందించారు.