భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, నవంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

DCC నేత బాలాజీ నాయక్ కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ

డిసిసి నేత"బాలాజీ నాయక్"కు కాంగ్రెస్ నేతల పరామర్శ..

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: DCC మానుకోట నాయకుడు గుగులోతు బాలాజీ నాయక్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి దస్రు నాయక్ కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల నాయకులు మంగళవారం నెల్లికుదురు మండలం రత్తిరాం తండాలోని బాలాజీ నాయక్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలాజీ నాయక్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. దస్రు నాయక్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బాలాజీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రావుల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల శంకర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్, మాజీ సర్పంచ్ పెరుమాండ్ల మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజి ప్రవీణ్ రెడ్డి, తాళ్ల సతీష్, బొల్లు లింగమూర్తి, చెన్నబోయిన శ్రీనివాస్, జెల్ల ఉపేందర్, వెంకన్న తదితరులు ఉన్నారు.