భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: DCC మానుకోట నాయకుడు గుగులోతు బాలాజీ నాయక్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి దస్రు నాయక్ కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు దుఃఖంలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల నాయకులు మంగళవారం నెల్లికుదురు మండలం రత్తిరాం తండాలోని బాలాజీ నాయక్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా స్వర్గీయ దస్రు నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలాజీ నాయక్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు.…






